![]() |
![]() |
.webp)
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ రష్మీ ఇప్పుడు అనుకోని పరిస్థితిని ఎదుర్కుంటోంది. రష్మీ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వరుస పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అదొక ఎమోషనల్ పోస్టు. “నేను సర్జరీ చేయించుకోవడానికి రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే భుజానికి తగిలిన ఆ గాయం నా డాన్స్ మూమెంట్స్ కి ఇబ్బంది కలిగిస్తోంది. వాటన్నింటినీ నేను మిస్ అవుతున్నాను. డాన్స్ మూవ్స్ లో భుజం పట్టేసింది. ఆ సర్జరీ అయ్యాక మళ్ళీ అంత సెట్ అవుతుందని భావిస్తున్నాను” అంటూ హాస్పిటల్ బెడ్ మీద సర్జరీ డ్రెస్ లో సెల్ఫీ తీసుకుని ఆ ఫోటోని స్టేటస్ లో పెట్టింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మీ అభిమానులు అసలు ఆమెకు ఏమైందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. రష్మీ త్వరగా కోలుకొని మళ్ళీ మామూలుగానే ఇండస్ట్రీలో బిజీ కావాలని కోరుకుంటూ ఉండడం గమనార్హం. ఉదయ్ కిరణ్ నటించిన ‘హోలీ’ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది ఇక తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది రష్మీ. తెలుగులోనే కాదు కన్నడ, హిందీ, తమిళ్ లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
![]() |
![]() |